Hero Ajith Kumar : తన భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అజిత్

నటి షాలిని మలయాళం,తమిళ చిత్రసీమలో హీరోయిన్ రాణించింది...

Hello Telugu - Hero Ajith Kumar

Ajith Kumar : కోలీవుడ్ లో స్టార్ కపుల్ గా రాణిస్తున్నారు అజిత్, షాలిని. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా కొనసాగుతున్న నటుడు అజిత్(Ajith Kumar) తన భార్య షాలిని పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. నటుడు అజిత్ కుమార్ నవంబర్ 20న తన భార్య షాలిని పుట్టినరోజు కానుకగా ఖరీదైన లెక్సస్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.. ఆ లెక్సస్ కారుతో నటి షాలిని దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అమర్కలం చిత్రం ద్వారా ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట సినీ జంటగా చేరిన వీరు ఇప్పటి వరకు తమిళ చిత్రసీమలో పాపులర్ జంటగా కొనసాగుతున్నారు.

Hero Ajith Kumar Surprise..

నటి షాలిని మలయాళం,తమిళ చిత్రసీమలో హీరోయిన్ రాణించింది. ఆమె బాల నటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. తరువాత టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. మలయాళం చిత్రం “ఊమాకుయిల్”లో నటించిన తర్వాత తమిళ చిత్రసీమలో బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. ఆమె 1999లో శరణ్ దర్శకత్వం వహించిన ‘అమర్కలం’ చిత్రంలో నటుడు అజిత్ సరసన నటించింది. ఈ ఏడాది అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజిత్‌కు తమిళ్‌లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అజిత్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక షాలిని నటించిన సఖీ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.

Also Read : Jani Master : జానీ మాస్టర్ బెయిల్ రద్దు ధర్మాసనం సంచలన తీర్పు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com