Hero Ajith Kumar : షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ ‘విడా ముయార్చి’ సినిమా

ఇంకా ఈ చిత్రంలో ఆరవ్‌, రెజీనా, నిఖిల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు...

Hello Telugu - Hero Ajith Kumar

Hero Ajith Kumar : అజిత్‌కుమార్‌ హీరోగా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడా ముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన అజిత్ లుక్‌కు మంచి స్పందన రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. టాప్‌ స్టార్స్‌, టెక్నీషియన్లు ఈ చిత్రంలో భాగమయ్యారు. అజిత్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్‌)లో అజిత్‌ కుమార్‌, త్రిష, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు.

Hero Ajith Kumar Movies Update

ఇంకా ఈ చిత్రంలో ఆరవ్‌, రెజీనా, నిఖిల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. చివరి షెడ్యూల్ ను అజార్ బైజాన్ లో పూర్తి చేసారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్‌ అందరూ కలిసి ఫోటోకు పోజిచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసిన ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. ఎంతో సరదాగా షూటింగ్‌ను ఫినిష్‌ చేశారని అర్థం అవుతోంది. ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను సన్‌ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది.

Also Read : NEET 2024:పార్లమెంట్‌లో ‘నీట్’ రగడ ! విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com