Hero Ajit Kumar: దక్షిణాది భాషల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో కోలీవుడ్ అగ్ర నటుడు అజిత్ ఒకరు. అజిత్ ఇటీవల నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. దీనితో అజిత్ తన సినిమాల జోరును పెంచేసారు. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రం ‘విడాముయర్చి’ లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే… మరోవైపు అజిత్(Ajit Kumar) తన నెక్స్ట్ సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తాజా సమాచారం. ‘విడాముయర్చి’ తరువాత అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తన నవ సినిమాలో టించడానికి అజిత్ సిద్ధమవుతున్నారు.
అలాగే అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఈ సినిమాకు కేజీఎఫ్‌తో తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా దర్శకుడుగా మారి తాజాగా సలార్ చిత్రంతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నప్రశాంత్ నీల్ ను దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. దీనితో అజిత్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. అసలే అజిత్ మాస్ ఫాలోయింగ్ కు… ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ జోడైతే బాక్సాఫీసు బద్దలవడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Hero Ajit Kumar Movie with Prashanth Neel
‘కేజిఎఫ్’ సిరీస్ తరువాత ప్రశాంత్ నీల్ ను పాన్ ఇండియా లెవల్లో అవకాశాలు వెంటాడుతున్నాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇటీవల విడుదల చేసిన ‘సలార్- సీజ్ ఫైర్ పార్ట్-1’ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుని వెయ్యి కోట్ల క్లబ్ దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3, సలార్ 2 చిత్రాలను నిర్మించాల్సి ఉంది. ఆ తరువాత టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో చిత్ర చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తాజాగా అజిత్(Ajit Kumar)… ఆ జాబితాలో చేరారు. మరోవైపు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా మంచి పేరు సంపాదించిన మైత్రి మూవీ మేకర్స్ మొదటి సారిగా అజిత్ సినిమాతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి… అక్కడ కూడా పాగా వేసేందుకు పెద్ద ప్లాన్ వేసిందటని సినీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో అజిత్ తన సినిమాకు ప్రశాంత్ నీల్ ను దర్శకునిగా కోరడంతో… మైత్రి మూవీ మేకర్స్ ఆ దర్శకునితో టచ్ లోనికి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Also Read : Director K Balachander: కె.బాలచందర్ శిలావిగ్రహం ఏర్పాటు చేయనున్న తమిళనాడు ప్రభుత్వం