Hema Malini: మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బాలీవుడ్ సీనియనర్ నటి హేమ మాలిని విజయం సాధించారు. యూపీలోని మథుర లోక్ సభ నియోజకవర్గం బరిలో నిలిచిన ఆమె వరుసగా మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్‌గర్‌పై 5,10,064 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. తాజాగా ఈ విజయంపై ఆమె కూతురు, నటి ఇషా డియోల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు మమ్మా… హ్యాట్రిక్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Hema Malini Won
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి హేమ మాలిని… 1999లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టడంపై హేమమాలిని స్పందించారు. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Nayanthara-Trisha : ఆ ఇరు భామల మధ్య జరుగుతున్నా కోల్డ్ వార్