Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Hema Case..
నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ(Hema) డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.
Also Read : Sudheer Babu: జూన్ 4 చంద్రబాబుకు, 14 నాకు కలిసొస్తుంటున్న సుధీర్ బాబు !