Hema Choudhary: ప్రముఖ దక్షిణాది నటి హేమా చౌదరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె కుమారుడు విదేశాల నుంచి హుటాహుటీన ఇండియాకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వందలాది కన్నడ సినిమాల్లో నటించిన హేమా చౌదరి(Hema Choudhary)… తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ, మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు.
Hema Choudhary Health Issues
కన్నడలో డా. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకులతో హేమా చౌదరి కలిసి పనిచేసారు. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Also Read : Neha Dhupia: గ్లోబల్ స్టార్ గా మరో బాలీవుడ్ బ్యూటీ