Hema: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమకు షాక్ ! ట్విస్ట్‌ ఛార్జ్‌ షీట్‌లో హేమ పేరు !

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమకు షాక్ ! ట్విస్ట్‌ ఛార్జ్‌ షీట్‌లో హేమ పేరు !

Hello Telugu - Hema

Hema: కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్న ఆరోపణలతో నటి హేమ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్‌ పై బయటకు వచ్చారు. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని… అందుకు సంబంధించి తాను టెస్ట్‌లు చేయించుకున్నానని ఆమె గతంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమెపై మా నిషేదాన్ని కూడా ఎత్తి వేసింది. అయితే బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో హేమ(Hema)కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రేవు పార్టీపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అందులో 88 మందిని నిందితులుగా వారు పేర్కొన్నారు. అయితే నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌ లో పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీలతో వారు ఛార్జ్‌షీట్‌ రెడీ చేశారు.

బెంగళూరు రేవ్‌ పార్టీలో హేమ ఎండీఎంఏ డ్రగ్స్‌ సేవించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ను కూడా ఛార్జ్‌షీట్‌తో వారు పొందుపరిచారు. హేమ(Hema)తో పాటు 79 మందిని నిందితులుగా చేర్చారు. పార్టీ నిర్వహించిన మరో 9మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్‌- 27 కింద హేమను నిందితురాలిగా ఛార్జ్‌షీట్‌ లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, హేమతో పాటు రేవ్‌ పార్టీకి హాజరైన మరో నటుడికి డ్రగ్స్‌ తీసుకోలేదని రిపోర్ట్‌ వచ్చింది. బెంగళూరు పోలీసులు తాజాగా అందించిన ఛార్జ్‌షీట్‌ తో నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది.

బెంగళూరు రేవు పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని పలు మీడియా సంస్ధల ఇంటర్వ్యూలలో నటి హేమ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారంటూ తాజాగా ఛార్జ్‌షీట్‌లో తన పేరు చేర్చి షాకిచ్చారు. దీంతో ఆమెకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. ఈ వివాదం నుంచి ఆమె ఎలా బయటపడుతారంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Hema – సినీ నటి హేమపై ‘మా’ నిర్ణయం ఎటు ?

‘హేమ’ చెబుతున్న మాటల వల్ల కొద్దిరోజుల క్రితం ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) కూడా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో డ్రగ్స్‌ నెగటివ్‌ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆపై వాటిని ‘మా’కు కూడా ఒక కాపీ పంపింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కూడా బెయిల్‌ మంజూరు చేసిందని కూడా తెలిపింది. దీంతో ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను మా ఎత్తివేసింది. ఇప్పుడు ఆమె పేరు ఛార్జ్‌షీట్‌లో ఉండటంతో ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : Sai Durgha Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com