Hello Baby: కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హలో బేబీ(Hello Baby)’. ఎస్‌కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
Hello Baby Movie Updates
ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ… ‘ట్రైలర్ చూస్తుంటే సోలో క్యారెక్టర్ తో తో సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయం. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. హ్యాకింగ్‌పై తీస్తున్న మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు’ అని కొనియాడారు.
నిర్మాత ఆదినారాయణ మాట్లాడుతూ… ‘ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. హీరోయిన్ కావ్య కీర్తి అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది’ అని అన్నారు.
Also Read : Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 12 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !