Heeramandi: వచ్చేసింది హీరామండీ నవాబ్స్‌ ఫస్ట్ లుక్ !

వచ్చేసింది హీరామండీ నవాబ్స్‌ ఫస్ట్ లుక్ !

Hello Telugu - Heeramandi

Heeramandi: దేవదాస్, పద్మావతి, గంగూభాయ్ కతివాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి ఎన్నో వాస్తవిక కథలను కళ్ళకు కట్టినట్లు చూపించిన భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే మొదటి సారిగా ఈ దర్శకుడు తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ(Heeramandi): ది డైమండ్‌ బజార్‌’ తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండింటి కలయికలో రూపొందిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’… బాలీవుడ్‌ అందాల తారలందరిని ఒకే ఫ్రేమ్‌ లో మహారాణుల మాదిరిగా చూపించబోతున్న ఈ వెబ్ సిరీస్‌ ను మే1న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Heeramandi 1st Look Viral

ఈ నేపథ్యంలో ఐదుగురు అందాల తారలను ఒకే ఫ్రేమ్ లో బంధించి… ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ఈ అందాల తారల ఫస్ట్‌ లుక్‌ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆ ఐదుగురు అందాల తారల యొక్క నావాబులను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ హీరామండీ నవాబ్స్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ సిరీస్‌ లోని నవాబ్స్‌ పాత్రలో నటిస్తున్న కథానాయకుల ఫస్ట్‌ లుక్‌ లను ఇన్‌స్టా వేదికగా విడుదల చేసింది వెబ్ సిరీస్‌ బృందం. ఇందులో వాలీ మహమ్మద్‌ పాత్రలో ఫర్దీన్‌ ఖాన్‌, జుల్ఫికర్‌ గా శేఖర్‌ సుమన్‌, నవాబ్‌ కొడుకు తాజ్దార్‌ పాత్రలో తాహా షా, రిచా చద్దా ప్రియుడు జోరావర్‌ పాత్రలో అధ్యాయన్‌ సుమన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ హీరామండీ నవాబ్స్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read : Premalu: ఓటీటీలోకి ‘ప్రేమలు’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com