Heeramandi: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi)’. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండింటి కలయికలో రూపొందిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలివారంలోనే ‘హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi)’ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని విశేష గుర్తింపు అందుకుంది. 4.5 మిలియన్ వ్యూస్‌ని సాధించడంతో పాటూ, 43 దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ వన్‌గానూ నిలిచింది.
Heeramandi…
పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ తాజాగా ప్రతిష్టాత్మక బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ది ఆసియా కంటెంట్ అవార్డ్స్, గ్లోబల్ ఓటీటీ అవార్డ్స్) ‘ఉత్తమ ఓటీటీ ఒరిజినల్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలకు ఇది నామినేట్ అయ్యింది. అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కార్యక్రమం జరగనుంది. బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తన సిరీస్ నామినేట్ కావడంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆనందం వ్యక్తం చేశారు. టీమ్ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ‘‘ఈ అవార్డులకు నామినేట్ కావడం గర్వంగా ఉంది. ఈసారి ఆ అవార్డులకు ఎంపికైన భారతీయ ప్రాజెక్ట్ ఇదే కావడం… అందులోని రెండు విభాగాలకు నామినేట్ కావడం సంతోషంగా ఉంది. నన్నింత ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మా ప్రాజెక్టును ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు ’’ అని సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు.
హీరామండి.. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్ లోని ఈ వేశ్య వాటికలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా, భారీ తారాగణంతో రూపొందింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిల్ సెగల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమారు రూ.200 కోట్లతో దీనిని తీర్చిదిద్దినట్లు సమాచారం. మొదటి భాగం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో దానికి సీక్వెల్‌గా రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే తెలిపింది.
Also Read : Ustaad Bhagat Singh Update : పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కీలక అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం