Ginger Tea Health Tip : ప్రస్తుతం ఉన్న జీవన శైలి కారణంగా చాలా మంది లావు అవుతున్నారు. జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం, వర్క్ బీజీలో పడి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన చాలా మంది లావు అవుతున్నారు.దీంతో ఎలా బరువు తగ్గాలని డైట్ చేయడం, జిమ్‌కు వెళ్లడం లాంటివి చేస్తారు. కాగా, అలాంటి వారి కోసమే చక్కటి చిట్కా. అదేంటి అనుకుంటున్నారా?
మార్నింగ్ కాగానే చాలా మంది టీ తాగుతు ఉంటారు. అయితే ఉదయాన్నేఅల్లం టీ తాగడం వలన ఈజీగా బరువు తగ్గించుకోవచ్చునంట. అల్లం వంట రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందువలన ప్రతీ రోజు ఉదయం అల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Ginger Tea Health Tip – అల్లం టీ తయారు చేసే విధానం
అల్లం టీ(Ginger Tea) చేయడానికి, ముందుగా ఒక పాత్రలో నీరు వేసి, అది కొద్దిగా ఉడకినప్పుడు, అల్లం, జీలకర్ర మరియు తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ టీని వడకట్టి అందులో తేనె కలిపి తాగాలి. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు, మధుమేహ , ఊబకాయం వలన బాధపడేవారికి కూడా చాలా మంచిది.