Turmeric :ఏ వంటలోనైనా పసుపు అనేది తప్పని సరి. పసుపులేని వంటిల్లే ఉండదు. ఆరోగ్యానికి మంచిదని పసుపును ప్రతీ కూరల్లో వండుతుంటారు.
అయితే పసుపు ఆరోగ్యానికి మంచిదని కొంత మంది వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ పసుపు ఆరోగ్యానికి మంచిదైనా, అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు.
రోజుకు 500 నుంచి 2000 మిల్లీ గ్రాముల పసుపు తీసుకోవడం మంచిది. అంతకు మించి తీసుకోవడం మంచిది కాదని, అలా తీసుకోవడం వలన దుష్ర్ఫవాలు ఉంటాయంట, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Turmeric Uses
1. పాలిచ్చే తల్లులు పసుపుకు దూరంగా ఉండాలంట. ఎందుకంటే అవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపించగలవు.
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు లేదా కొన్ని మందులు వాడేవారు పసుపును(Turmeric) తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి రక్తస్రావం రుగ్మతలు, జీర్ణశయాంతర సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తాయి.
2. పసుపు యాసిడ్ రిఫ్లక్స్ మరియు పిత్తాశయ రాళ్లు వంటి కడుపు సమస్యలను తీవ్రతరం చేస్తుంది
3. కొంతమంది వ్యక్తులు 450 mg లేదా అంతకంటే ఎక్కువ పసుపు తీసుకున్నప్పుడు తలనొప్పి మరియు మైకము వచ్చే అవకాశం ఉంది.
Also Read : Breastfeeding : బిడ్డకు పాలిస్తూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?