తల్లి కాబోతున్న కన్నడ బ్యూటీ హర్షిక పూనాచా !
ప్రముఖ కన్నడ నటి హర్షిక పూనాచా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 15 ఏళ్ళకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడు భువన్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ… త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటోతో సహా రివీల్ చేసింది. అంతేకాదు ఈ ఫొటోలో భర్తతో కలిసి డిఫరెంట్ ఔట్‌ఫిట్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కర్ణాటకకు చెందిన హర్షిక… 15 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. ‘ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి’, ‘అప్పుడు అలా ఇప్పుడు ఇలా’ అనే తెలుగు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా చేస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీను కూడా ఈమె నిర్వహిస్తోంది. ఇందులో హర్షిక పార్ట్‌నర్ నటుడు భువన్ పొన్నాన. ఇలా బిజినెస్ పార్ట్‌నర్స్ కాస్త గతేడాది ఆగస్టులో పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే పలువురు వీళ్లకు విషెస్ చెబుతున్నారు.