Pailam Pilaga: నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, ఇంకా చాలా మంది బాలీవుడ్ అగ్ర నటులతో సహా వందకు పైగా యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన ఆనంద్ గుర్రం మొదటి సారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘పైలం పిలగా(Pailam Pilaga)’. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. చిన్న సినిమా అయినప్పటికీ ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టీజర్ ని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేశారు.
Pailam Pilaga Teaser Release
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారు అనిపిస్తుంది. టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, టైటిల్ క్యాచిగా ఉంది, మంచి డైలాగ్స్ ఉన్నాయి. మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగుణ్ణి ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది అంటూ పైలం పిలగా సినిమా టీంని అభినందించారు.
ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది డబ్బు.. ఒక చిన్న పల్లెను పాలించాలన్న, మొత్తం ప్రపంచాన్ని శాసించాలన్నా జేబు నిండుగా ఉండాలి. ఈ సత్యం గ్రహించి తెలంగాణ పల్లెలో పుట్టి పెరిగిన ఓ పిలగాడు దుబాయ్ వెళ్లి లక్షలు, కోట్లు సంపాదించాలని, అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కోసం చేసే ప్రయత్నంలో తాను ఒక్కడే కాదు ఊరంతా బాగుపడే వ్యాపార అవకాశం దొరికి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే క్రమంలో బ్యూరోక్రసీ సిస్టమ్‌లో ఇరుక్కొని ప్రేమించిన అమ్మాయిని, కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రంగా ఈ పైలం పిలగా తెరకెక్కింది.
Also Read : Committee Kurrollu: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ కు శ్రీకారం చుట్టిన ‘కమిటీ కుర్రోళ్ళు’ !