Harika Narayan: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ టైటిల్ ట్రాక్ తో దుమ్మురేపిన టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్. ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటాంబానికి దగ్గరి బంధువుగా సంగీత ప్రపంచంలోనికి అడుగుపెట్టిన హారిక… కొణిదెల నిహారిక ప్రథాన పాత్రలో తెరకెక్కించిన ‘సూర్యకాంతం’తో ప్లేబ్యాక్ సింగర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న హారిక(Harika Narayan) ఆ తర్వాత ‘నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్)’ సాంగ్‌తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యారు. విభిన్నమైన వాయిస్ తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక… 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్ ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. మహేశ్ బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉన్న హారిక… ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే ఉద్దేశ్యంతో ‘బ్రహ్మోత్సవం’లో నటించినట్లు గతంలో ఆమె తెలిపారు.
Harika Narayan Marriage Updates
ప్రస్తుతం వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్ లో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్(Harika Narayan)… త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపింది. మాఇద్దరి మధ్య స్నేహంగా ఏర్పిడిన పరిచయం… ఆపై ప్రేమగా మారిందని తెలిపిన ఆమె… ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగినట్లు చెప్పారు. అంతేకాదు వారిద్దరు ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోను హారిక… తన ఇన్ స్టా లో షేర్ చేశారు. కానీ తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు ఆమె వెల్లడించలేదు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హారిక… తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. అయితే అనుకోని విధంగా ఆమె గాయనిగా మారి… నేడు తన గాత్రంతో అందర్నీ మెప్పిస్తుంది. సింగింగ్ తో పాటు హీరోయిన్ గా కూడా ఆమెకు అవకాశాలు ఉన్నాయని… అందం, అభినయం ఆమెకు ప్లస్ అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె పెళ్లికి సిద్ధమౌతుంటే… సింగర్ గానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : Rakhi Sawant: అనంత్ అంబానీపై నటి రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు !