Hari Hara Veera Mallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొదటిసారి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటిస్తూ… మొదటి భాగం నుండి టీజర్ ను విడుదల చేసింది. “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో విడుదల చేస్తున్న మొదటి భాగానికి “ధర్మం కోసం యుద్ధం” అనే ట్యాగ్ లైన్ ఉంది.
Hari Hara Veera Mallu :
పేదలు దోపిడీకి గురవుతూ… ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో… న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘హరిహర వీరమల్లు’ పాత్రను టీజర్ లో స్పష్టంగా చూపించారు. దేశంలో దొరల పాలన, నవాబుల దాడులు ఎక్కువైనప్పుడు అలాగే మొఘల్ చక్రవర్తులు ఆధిపత్యం ఉన్నప్పుడు పేదవాళ్లు ఎంతగా ఇబ్బంది పడ్డారు అనే కాన్సెప్ట్ ను టచ్ చేస్తూనే వారిని ఎదిరించే దీరుడుగా వీరమల్లును చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనుందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతోంది. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. దీనితో వీరమల్లుగా వెండితెరపై పవన్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడో పూర్తి కావాల్సిన ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)‘ సినిమా… వివిధ కారణాల వలన షూటింగ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉండడం అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు రావడంతో ఈ సినిమా మరింత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ సమస్య నుంచి వీరమల్లుకి ఒక సొల్యూషన్ దొరికినట్లు అనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించినప్పటికీ దీన్ని పూర్తి చేసే బాధ్యతను నిర్మాత కొడుకు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. రెండు భాగాలుగా రానున్న వీరమల్లు పార్ట్1 కు స్వార్డ్ vs స్పిరిట్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక టీజర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను మరింత హైలెట్ చేసే విధంగా చూపించారు.
Also Read:-Rajinikanth: త్వరలో రజనీకాంత్ బయోపిక్ ?