Lokesh Kanagaraj : తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). ఇవాళ తన పుట్టిన రోజు. 39 సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అత్యంత జనాదరణ కలిగిన సినిమాలు తీయడంలో సక్సెస్ అయ్యాడు. తన మేకింగ్ టేకింగ్ లో వెరీ స్పెషల్. మార్చి 1986లో తమిళనాడులోని కినాతుకడవులో పుట్టాడు. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా పేరు పొందాడు. 2015 నుంచి ఇప్పటి దాకా సినీ రంగంలోనే కొనసాగుతున్నాడు.
Lokesh Kanagaraj Birthday
లోకేష్ కనగరాజ్ భార్య ఐశ్వర్య. 2017లో తమిళంలో విడుదలైన మానగరం మూవీ ద్వారా డైరెక్టర్ గా సినీ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. 2021లో మాస్టర్ తీశాడు. ఇందులో దళపతి విజయ్ కీలకమైన పాత్ర పోషించాడు. నటిగా మాళవిక మోహన్ ను తీసుకున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2022లో విక్రమ్ చిత్రం తీసి సర్ ప్రైజ్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్.
ఎంబీఏ చేశాక..బ్యాంకులో నాలుగున్నర ఏళ్లు పని చేశాడు. 2014లో ‘కస్టమర్ డిలైట్’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కు ఓ కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మొదటి ప్రైజ్ వచ్చింది. ఆ కాంపిటీషన్ న్యాయనిర్ణేతగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఉండడం కలిసొచ్చింది. కాలం లఘు చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2018లో వెల్ల రాజాకు సహ రచయితగా ఉన్నాడు. 2019లో ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించాడు. కమల్ తో తీసిన విక్రమ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ తీస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Hero Aamir Khan :ఓటీటీల వల్లే బాలీవుడ్ సినిమాలకు దెబ్బ