Hanuman Movie : సంక్రాంతికి వచ్చి దుమ్ము దులిపిన హనుమాన్ ఇప్పుడు జపాన్ లో…

సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించగా...

Hello Telugu - Hanuman Movie

Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కోట్లు కలెక్షన్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థ్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సినిమా జపాన్‌లో రిలీజ్‌కు సిద్థమైంది. అక్టోబర్‌ 4న అక్కడి ఈ చిత్రం అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ(Prasanth Varma) తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘ విడుదలైన అన్నిచోట్ల సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘హనుమాన్‌’ ఇప్పుడు జపాన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడి వారికి వినోదాన్ని పంచనుంది. అక్టోబర్‌ 4న జపనీస్‌ సబ్‌టైటిల్‌ వెర్షన్‌ విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు. దీనికి హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

Hanuman Movie Records

సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్‌ కథానాయిక నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ‘జై హనుమాన్‌’ రానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘ శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ రూపుదిద్దుకోనుంది. 2025లో ఈ సినిమా విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. ‘‘ హను-మాన్‌’ కంటే వందరెట్టు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు’’ అని ప్రశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read : Allari Naresh : మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అల్లరి నరేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com