Hanuman OTT : తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టిస్తోంది. “హనుమాన్` విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ప్రజల్లో అంచనాలను పెంచేశాయి. ‘హనుమాన్’ నేడు (జనవరి 12న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో జనవరి 11వ తేదీ రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన క్షణం నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. అందరూ బ్లాక్ బస్టర్స్ అంటూ మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Hanuman OTT Rights Updates
ఈ చిత్రం శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ రావడంతో. ఈ చిత్రానికి సంబంధించిన OTT హక్కులు చాలా కీలకంగా మారాయి. హనుమాన్(Hanuman) సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT కంపెనీ ZEE5 భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సతెలుస్తుంది. హనుమాన్ తెలుగు వెర్షన్ ధర 11 కోట్లు మరియు హిందీ వెర్షన్ 5 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.
తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి, వినయ్ రాయ్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. తేజ నాలుగో సినిమా ఓటీటీ హక్కులు ఇంత భారీ స్థాయిలో అమ్ముడుపోవడం రికార్డ్ అనే చెప్పాలి. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Also Read : Kalki 2898 AD Updates : డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన టీమ్