Hanuman Donation: అయోధ్య రామ మందిరంకు ‘హను-మాన్‌’ టీమ్‌ రూ. 14.25 లక్షల విరాళం

అయోధ్య రామ మందిరంకు ‘హను-మాన్‌’ టీమ్‌ రూ. 14.25 లక్షల విరాళం

Hello Telugu - Hanuman Donation

Hanuman: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుని… కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఇచ్చిన హామీను ‘హను-మాన్’ సినిమా యూటిట్ నిలబెట్టుకుంది. ఈ సినిమా ఆడినంత కాలం ప్రతీ టిక్కెట్టుపై ఐదు రూపాయలను అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తానని మెగాస్టార్ నోటి ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పించారు.

Hanuman Donations Viral

ఈ నేపథ్యంలో మొదటి రోజు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్లలో… టిక్కెట్టుపై ఐదు రూపాయల చొప్పున మొత్తం రూ.14.25 లక్షలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆ మొదటి రోజు కలెక్షన్ల విరాళం చెక్ ను చిత్ర యూనిట్ ప్రదర్శించింది. అంతేకాదు ఓ వెబ్ సైట్ రూపొందించి విరాళంకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు.

‘జాంబీరెడ్డి’ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ- నటుడు తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హను-మాన్‌(Hanuman)’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి, హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. అమృత అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌ ముఖ్య పాత్రల్లో మెప్పించారు. కోటి అనే వానర పాత్రకు ప్రముఖ హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించడం ఈ సినిమాకు మరో అదనపు బలంగా మారింది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథ, విజువల్స్‌, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో మహేష్ బాబు గుంటూరుకారం సినిమాకు పోటీగా ఈ సినిమాను విడుదల చేసిన చిత్ర యూనిట్ సక్సెస్ సాధించిందనే చెప్పుకోవాలి.

Also Read : Hero Prabhas in Temple: మంగుళూరు శ్రీ దుర్గా పరమేశ్వరి దైవసన్నిధిలో ప్రభాస్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com