Hanuman: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న ‘హను-మాన్’ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ‘హను-మాన్(Hanuman)’ సినిమా డిజిటల్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే స్ట్రీమింగ్ కు రాలేదు. దీనితో ‘హను-మాన్’ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hanuman Movie Updates
టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘హను-మాన్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జియో సావన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మార్చి 16 న ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటిందింది. అయితే… ఆ సినిమా కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒరిజినల్ డిజిటల్ రైట్స్ పొందిన జీ5 లో దక్షిణాది భాషల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కు ఉంచుతున్నట్లు అనే దానిపై క్లారిటీ లేదు. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
Also Read : Kubera Movie : నాగ్, ధనుష్ మల్టీస్టారర్ గా శేఖర్ కమ్ముల సినిమాకు టైటిల్ ఖరారు