Nithin : నితిన్ రెడ్డి ప్రస్తుతం రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మూవీ సాంగ్స్ టాప్ లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే స్పెషల్ సాంగ్ లో కేతిక శర్మ చేసిన పాట కొంత వివాదానికి దారి తీసింది. శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ దారుణంగా ఉందంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమాలలో రావాలని లేదని చెప్పింది. తనకు నితిన్ రెడ్డి(Nithin) బెస్ట్ ఫ్రెండ్ అని, అతడి కోసమే తాను ఐటమ్ సాంగ్ చేశానని తెలిపింది. ఇటీవలే చిట్ చాట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Nithin Movie Special Song
ఇదిలా ఉండగా ఇద్దరూ కలిసి గుండె జారి గల్లంతయ్యిందే మూవీలో నటించారు. ఇది 2013లో రిలీజ్ అయ్యింది. మంచి ఆదరణ చూరగొంది. పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో స్పెషల్ పాటతో తళుక్కున మెరిసింది గుత్తా జ్వాల. ఈ సినిమాను విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించగా ఎన్ సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో నితిన్ తో పాటు నిత్యా మీనన్ కీలక పాత్రలు పోషించారు. నితిన్ తో కలిసి హోరెత్తించింది గుత్దా జ్వాలా.
తన స్వస్థలం మరాఠా. ఆమె సెప్టెంబర్ 7, 1983లో వార్దాలో పుట్టారు. హైదరాబాద్ లో పెరిగారు. 13 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. జూలై 17, 2005లో చేతన్ ఆనంద్ తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత విడి పోయారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది గుత్తా. కేవలం తన ఫ్రెండ్ కోసమే ఆ పాట చేశానని, అది సూపర్ హిట్ అయ్యిందని తెలిపింది. బ్యాడ్మింటన్ లో అయితే విశ్రాంతి ఉంటుందని, కానీ సినిమాలలో ఆ వెసులుబాటు ఉండదని పేర్కొంది.
Also Read : Hero Suriya-Pooja :సూర్యతో జతకట్టిన బుట్టబొమ్మ