తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటలతో సినిమాను నడిపించ గలడు. గుండెల్ని పిండగలడు. అద్భుతమైన సీన్స్ తో పండించగలడు. అంతే కాదు ఆసక్తిని రేకెత్తించి..మనుషుల్ని మరిచి పోలేకుండా చేయగలడు. తను ఏది మాట్లాడినా అది ఓ సంచలనం. కేవలం డైలాగుల కోసమే తన సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. ఈ విషయం చెప్పేందుకు సందేహించాల్సిన పని లేదు.
అందరి కళ్లు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే ఉన్నాయి. తను మహేష్ బాబు , శ్రీలీల, మీనాక్షితో కలిసి గుంటూరు కారం చిత్రం తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం త్రివిక్రమ్, ప్రిన్స్ కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ.
ఇప్పటికే కీలకమైన సన్నివేశాలు పూర్తయినట్లు సమాచారం. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ ప్రత్యేకమైన సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అప్ డేట్ ఏమిటంటే నవంబర్ 7 ప్రత్యేకం. ఆరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే. ఇందులో భాగంగా గుంటూరు కారంకు సంబంధించిన తొలి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.