మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్. అంతే కాదు కథను నడిపించడంలో, సినిమాను అన్ని వర్గాలకు నచ్చేలా తీయడంలో తనకు తనే సాటి. ఆయన బన్నీతో తీసిన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో గుంటూరు కారం తీస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ప్రిన్స్ తో తను తీస్తున్న చిత్రం ఇది మూడోది. సాఫ్ట్ గా ఉన్న మహేష్ బాబును ఏకంగా మరీ వైలంట్ గా మార్చేసిన చరిత్ర త్రివిక్రమ్ ది.
గతంలో అతడు తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత తీసిన ఖలేజా సూపర్ . ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఇందులో లవ్లీ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా లేనన్ని గాసిప్స్ బయటకు వచ్చాయి. మొదట పూజా హెగ్డే తో షూటింగ్ ప్రారంభించారు.
ఆ తర్వాత ఆమె సైడ్ అయి పోయింది. చివరకు శ్రీలీలను తీసుకు వచ్చారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారి పోయినట్లు టాక్. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని, డబ్బింగ్ దశలో ఉందని సమాచారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇప్పటికే ప్రకటించారు సినిమాను సంక్రాంతికి తీసుకు వస్తామని.