మాటల మాంత్రికుడు , దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు , శ్రీలీల, మీనాక్షి చౌదరి కలిసి నటిస్తున్న గుంటూరు కారం చిత్రం షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి ఈ సినిమాపై పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.
కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా వచ్చే ఏడాది 2024లో సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
షూటింగ్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో అందమైన ఇంటిని డిజైన్ చేశారు. ఇప్పటికే లొకేషన్స్ క్లియర్ చేశారు. అన్నింటిని గోప్యంగా ఉంచారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మ్యూజిక్ డైరెక్టర్ మొదట ఎస్ఎస్ థమన్ అనుకున్నారు. కానీ ఆయన కూడా సైడ్ అయి పోయినట్లు టాక్. గుంటూరు కారం ప్రారంభ సమయంలో పాల్గొన్నారు ముద్దుగుమ్మ పూజా హెగ్డే.
ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దర్శకుడు ఆమెను తప్పించాడు. ఇందుకు హీరో మహేష్ బాబు కారణమని ప్రచారం జరిగింది. పూజా హెగ్డేకు బదులు అందాల ముద్దుగుమ్మ శ్రీలీలను తీసుకున్నారు. ఆమెతో పాటు మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది శ్రీలీల.