తెలుగు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అందరి చూపులు ఉన్నాయి. కారణం తను బన్నీ, పూజాతో అల వైకుంఠపురంలో తీశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు తారక్ తో అరవింద సమేతను తీశాడు.
అది కూడా హిట్టే. ప్రస్తుతం యువత కలల రాకుమారుడిగా పేరొందిన మహేష్ బాబు, శ్రీలీలతో గుంటూరు కారం తీస్తున్నాడు. ఎప్పటి లాగే తన సినిమాలో ఆసక్తిని రేపే పంచ్ లు, ప్రాసలు ఉంటాయని ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు.
లోతైన డైలాగులు, ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్ కు రప్పించే నైపుణ్యం, సత్తా కలిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . దీంతో ఆయన తీసే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ కిర్రాక్ తెప్పించేలా చేస్తున్నాయి.
ఇక ఎలాగైనా సరే వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంను తీసుకు రావాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. రోజుకో అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాడు.
తాజాగా అందిన సమాచారం మేరకు అన్నపూర్ణ లో ఓ పాట చిత్రీకరణ చేస్తున్నారు. మొత్తంగా అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.