Gunturu Karam : మరోసారి త్రివిక్రమ్ మార్క్ ఎలా ఉంటుందో రుచి చూపించేందుకు రెడీ అయ్యాడు. మేకింగ్ లో టేకింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో అతడు తీశాడు. అది తెలుగు సినిమా చరిత్రలో ఓ సెన్సేషన్ గా మిగిలి పోయింది.
Gunturu Karam Movie Updates
ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రిన్స్ , అనుష్క శెట్టితో ఖలేజా తీశాడు. ఇది కూడా బంపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ప్రపంచ వ్యాప్తంగా గుంటూరు ప్రాంతానికి స్పెషాలిటీ ఉంది. కారణం ఇక్కడ మిర్చికి పెట్టింది పేరు. వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం అంటే ప్రతి తెలుగు వారి లోగిళ్లలో వంట శాలల్లో ఉంటుంది.
ఇక మూవీ టైటిల్ పెట్టడం దగ్గరి నుంచి దృష్టి పెట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో డైలాగులకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అతడులోని డైలాగులు ఇప్పటికీ సెన్సేషన్ . తాజాగా మహేష్ బాబుకు ఏకంగా ఆసక్తికరంగా ఉండేలా గుంటూరు కారం(Gunturu Karam) అని పెట్టాడు.
మహేష్ బాబులో డిఫరెంట్ యాంగిల్ ను చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. సూపర్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Eagle Movie Teaser : రవితేజ ఈగల్ టీజర్ రెడీ