Guntur Karam in OTT: ఓటీటీలోకి ‘గుంటూరుకారం’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

ఓటీటీలోకి ‘గుంటూరుకారం’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Hello Telugu - Guntur Karam in OTT

Guntur Karam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సత్తాను చాటింది. ఇప్పటివరకు సుమారు రూ. 200 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ‘గుంటూరు కారం’… ఇంకా అక్కడక్కడా థియేటర్లలో బాగానే ఆడుతోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘గుంటూరు కారం’ అందుబాటులోకి రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. దీనితో ‘గుంటూరు కారం(Guntur Karam)’ కోసం ఓటీటీ అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Guntur Karam OTT Updates

వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు). చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోవ‌డంతో అతడు గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రిరావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు. వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు. వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి… ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు.

వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. త‌ల్లిని ఎంతో ప్రేమించే ర‌మ‌ణ… ఆ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టాడా ? ఇంత‌కీ అగ్రిమెంట్ లో ఏముంది ? త‌న త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు ? క‌న్న కొడుకుని వ‌సుంధ‌ర ఎందుకు వ‌దిలిపెట్టింది ? అనే ఇతి వృత్తంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను చాలా ఆశక్తికరంగా తెరకెక్కించారు.

Also Read: Mahesh Babu : కొత్త లుక్స్ తో హైదరాబాద్ లో ఎంటరైన సూపర్ స్టార్ మహేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com