Guntur Karam: సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా 100 రోజులాడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా…. మిడ్ నైట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఓవరాల్ గా యావరేజ్ అనిపించుకున్నప్పటికీ… ఈ సినిమా ఏకంగా రెండు థియేటర్లలో 100 రోజుల పాటు ఆడింది.
Guntur Karam Movie Updates
సినిమా హిట్ అయితే చాలు, వీకెండ్ వరకు థియేటర్లలో ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో… మహేశ్ ‘గుంటూరు కారం‘ 100 రోజులాడిందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్, కర్ణాటక ముల్బాగల్ లోని నటరాజ్ థియేటర్లలో ఈ మార్క్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ మూవీకి తప్పితే మిగతా వాటిని జనాలు లైట్ తీసుకుంటున్నారు. అలాంటిది 100 రోజుల పాటు మహేశ్ సినిమా ఆడటం ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ విషయం. ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట రిలీజైనప్పడు ఘోరంగా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడదే పాట 200 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు సినిమా కూడా 100 రోజులకు పైగా ఆడి అరుదైన ఘనత సాధించిందని చెప్పొచ్చు.
Also Read : Natural Star Nani: జెర్సీ సినిమాపై నాని ఎమోషనల్ పోస్ట్ !