దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంపై రోజుకో అప్ డేట్ వస్తోంది. చేయి తిరిగిన రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ ప్రిన్స్ తో తీస్తున్న మూడో చిత్రం ఇది. భారీ అంచనాలు ఉన్నాయి.
ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాలు తీశాడు. అతడు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఖలేజా పేరు తీసుకు వచ్చేలా చేసింది. గుంటూరు కారం సినిమాకు సంబంధించి పోస్టర్, టీజర్ కు భారీ స్పందన లభించింది.
ఎస్ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మొదట్లో పూజా హెగ్డేను అనుకున్నారు. ఎందుకనో ఆమె మధ్యలోనే వదిలేసింది. ఇక మీనాక్షి చౌదరి, శ్రీలీల మహేష్ బాబుకు తోడుగా నటిస్తున్నారు. ఇక పరుశురామ్ దర్శకత్వంలో ప్రిన్స్ నటించిన సర్కారు వారి పాట సూపర్ సక్సెస్ కావడంతో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఓ చిట్ చాట్ లో నటుడు మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు తన మూవీ గురించి. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్బంగా రాబోతోందని వెల్లడించారు. ఆయన చేసిన కామెంట్స్ తో ప్రిన్స్ పండుగ చేసుకుంటున్నారు.