Guntur Kaaram Updates : ఎట్టకేలకు అనుమతి సాధించిన ‘గుంటూరు కారం’

ఇక కలెక్షన్ల మోత మోగించబోతున్న 'గుంటూరు కారం'

Hello Telugu - Guntur Kaaram Updates

Guntur Kaaram : అతడు, కలేజా, వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Guntur Kaaram Updates Viral

దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ‘గుంటూరు కారం’ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు అనుమతినిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్ షో కూడా అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదం మేరకు సింగిల్ థియేటర్లకు రూ.65, మల్టీప్లెక్స్ సినిమాలకు రూ.100 టికెట్ ధర పెరిగే అవకాశం ఉంది.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో 12వ తేదీ అర్ధరాత్రి బెన్ఫిట్ షో ప్రదర్శనకి, 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎం చెప్పనుంది? అలాగే టిక్కెట్ల రేట్ల కోసం, బెన్ఫిట్ షోలకోసం ఫ్యాన్స్ ఎదురు చుస్తునారు.

తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరలను పెంచేందుకు పచ్చజెండా ఊపడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన జీవో ప్రకారం టిక్కెట్టుకు రూ.50 చొప్పున రుసుమును పెంచడానికి ఆంధ్రప్రదేశ్ వెసులుబాటును కల్పించింది. విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు పెరిగిన ధరలకు థియేటర్లలో ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ టిక్కట్లను విక్రయించవచ్చు. అయితే అదనపు ప్రదర్శనలకు సంబంధించి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం అందించలేదు. స్పెషల్ షోలకు అనుమతిస్తారా లేదా అనేది మహేష్ అభిమానులకు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సంక్రాంతికి నాగార్జున నా సామి రంగ, తేజ హనుమాన్, వెంకటేష్ సైందవ్ చిత్రాలతో పోటీ పడాల్సి ఉంది. హాసిని & హారిక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Also Read : Hero Nitin : షూటింగ్ లో గాయపడ్డ యువ నటుడు నితిన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com