Guntur Kaaram: రికార్డులు సృష్టిస్తున్న మహేశ్ బాబు ‘కుర్చీ మడతపెట్టి’ పాట !

రికార్డులు సృష్టిస్తున్న మహేశ్ బాబు ‘కుర్చీ మడతపెట్టి’ పాట !

Hello Telugu - Guntur Kaaram

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా… మిక్సిడ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ… సుమారు రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట… ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతూ యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ‘కుర్చీ మడతపెట్టి’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 50 ప్లస్ మిలియన్ల వ్యూస్ రాబట్టి… ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీనితో మహేశ్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సినిమా విషయంలో మిక్స్ డ్ టాక్ తో నిరాశ చెందిన అభిమానులు… ‘కుర్చీ మడతపెట్టి’ పాటతో ఖుషీ అవుతున్నారు.

Guntur Kaaram Movie Updates

‘కుర్చీ మడతపెట్టి’ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సంపాదించడానికి ముఖ్యకారణం పాటలోని లిరిక్స్, మహేష్-శ్రీలీలల డ్యాన్స్ మూమెంట్స్. థమన్ హై వోల్టేజ్‌ మాస్‌ నంబర్‌ ‌లో అదిరిపోయే బీట్‌లు… గ్రామీణ ప్రాంతాల్లో వినే జానపద శైలి సాహిత్యం ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాయి. ‘రాజమండ్రి రాగ మంజరి… మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి’, ‘తూనీగ నడుములోన తూటాలెట్టి… తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి… మగజాతినట్టా మడతపెట్టి…’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తుండటంతో శ్రోతలు రిపీటెడ్‌ గా పాటను చూస్తున్నారు. దీనితో పాట విడుదలై పది రోజుల తరువాత కూడా యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

అతడు, ఖలేజా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘గుంటూరు కారం(Guntur Kaaram)’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. థమన్ మ్యూజిక్ అందించారు.

Also Read : Oscar Nominations 2024 : ఆస్కార్ రేసులో ఉన్న భారతీయ సినిమాలు ఏవి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com