Janhvi Kapoor: బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన సినిమా ‘ఉలఝ్’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం తొలిసారి వీళ్లిద్దరూ కలిసి నటించారు. గుల్షన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జాన్వీ(Janhvi Kapoor)తో తనకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదని చెప్పారు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే తనతో మాట్లాడేదని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనితో గుల్షన్ ఈ వీటిపై క్లారిటీ ఇచ్చారు.
Janhvi Kapoor Comments..
‘జాన్వీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదన్నానంతే. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె మంచి నటి. చాలా ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా సన్నివేశాలు బాగా వచ్చాయి. చేసే ప్రతి సినిమా సెట్ లోనూ చిత్రబృందమంతా కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు కదా. నేను ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. దర్శకుడు చెప్పినట్లు చేశాం. గతంలో చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. వారందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. మేము ఎన్నో విషయాలు చర్చించుకునే వాళ్లం. కానీ, జాన్వీతో సినిమా గురించి మాత్రమే చర్చించాను. ఇదే విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించాను’ అని గుల్షన్ తెలిపారు.
గుల్షన్ చేసిన వ్యాఖ్యలపై జాన్వీ కూడా స్పందించారు. నిజంగానే సెట్ లో ఎప్పుడూ ఇతర విషయాలు మాట్లాడుకోలేదన్నారు. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రంగా ‘ఉలఝ్’ సిద్ధమైంది. సుధాన్షు సరియా దర్శకుడు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.
Also Read : Kareena Kapoor: రికార్డులకు వయసుతో సంబంధం లేదంటున్న బాలీవుడ్ బ్యూటీ !