Nag Ashwin : ఆ బడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాడే కారు అదా..

సహజంగా లాంగ్ హెయిర్ పెంచుకొని ఒక యోగిల కనిపిస్తుంటారు నాగి...

Hello Telugu - Nag Ashwin

Nag Ashwin : నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి తీసింది మూడు సినిమాలే అయినా బ్లాక్‌బస్టర్లు అందించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఇండస్ట్రీలో టాప్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ అయినా అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంకని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పకృతి ప్రేమికుడైన నాగి(Nag Ashwin).. చాలా స‌స్‌టేన‌బుల్ పనులు చేస్తుంటారు. కోటీశ్వరుడికి అల్లుడైన, కోట్లు కొల్లగొట్టే సినిమాలు తీసే నాగి కార్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.

Nag Ashwin…

సహజంగా లాంగ్ హెయిర్ పెంచుకొని ఒక యోగిల కనిపిస్తుంటారు నాగి(Nag Ashwin). మనిషి కూడా సాత్వికంగానే కనిపిస్తాడు. ఇప్పటి వరకే తన షోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తాను ఎంతో ప్రకృతి ప్రేమికుడో తెలియజేసాడు. సాధారణంగా కోటీశ్వరులు ఎవరైనా మినిమమ్ కోటి రూపాయల కంటే ఎక్కువ ధర పలికే కార్లు వాడుతుంటారు. తక్కువలో తక్కువ రూ. 80 లక్షలపై ఉన్న కార్ అయితే పక్కా. కానీ నాగ్ అశ్విన్ వాడే కారు ధర రూ. 5 లక్షల కంటే తక్కువే, అది కూడా మేడ్ ఇన్ ఇండియా కారు. (Mahendra eva) 2.50 లక్షల నుండి రూ. 4 లక్షల మధ్యలో ఉంటుంది.

ఇదొక ఎలక్ట్రానిక్ కారు. అయితే ఈ కారుని నాగ్ అశ్విన్ 5 ఏళ్ల ముందు నుండి వాడుతున్నారు. దీనికి ఛార్జింగ్ కూడా తన ఇంట్లో వాడే సోలార్ పానెల్స్ ఉండే పెడుతారట. సినీ ఇండస్ట్రీలో నేచురల్ గా ఇంపోర్టెడ్ అండ్ లగ్జరీ కార్లు వాడుతుంటారు. కానీ.. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లిగా ఉండేందుకు ఇష్టపడే నాగి.. పెట్రోల్, డీజీల్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉపయోగం వాటి అనర్థాలపై పూర్తి అవగాహనా కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఈ కార్ మైలేజ్‌ని ట్రాక్ చేస్తూ హ్యాపీగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటారు.

అంతేకాదు ఈ బ్లాక్ బస్టర్‌డైరెక్టర్ తన దుస్తువులు, చెప్పులు, ఇంటి నిర్మాణ పనుల్లోనూ చాలా స‌స్‌టేన‌బుల్‌గా వ్యవహరిస్తారు. కల్కి సినిమా రిలీజ్ టైమ్ లో ఆయన వాడిన చెప్పులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దుస్తులు కూడా ఎక్కువగ చవక టీ షర్ట్స్ వేస్తూ.. రిపీట్ కూడా చేస్తుంటాడు. గతంలో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ మాట్లాడుతూ.. పనిలో పడి ఎవరి చెప్పులు వేసుకెళ్తాడో తెలీదు, పని తప్ప వేరే ధ్యాసే ఉండదన్నారు. ఇక తన ఇంటి బయటి నిర్మాణాలను కూడా చెత్త వేస్టేజ్‌తో ఆయన నిర్మించాడు. మరో వైపు ఒక్కో సెలబ్రిటీల టీ షర్ట్, చెప్పుల ప్రైజ్ లక్ష వరకు ఉంటుంది. నేటి తరంలో నాగ్ అశ్విన్ లాంటి మనుషులు చాలా అరుదు.

Also Read : Naga Chaitanya-Sobhita : నాగ చైతన్య, శోభితల పెళ్లి పనులు షురూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com