Gowtham Vasudev : తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత సృజనాత్మకత కలిగిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్(Gowtham Vasudev). తను ఏ సినిమా తీసినా అది ఓ దృశ్య కావ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. తను తీసిన ప్రతి సినిమా అంతర్లీనంగా ఏదో ఒక సందేశంతో పాటు భావోద్వేగాలను ప్రతిఫలించేలా ఉంటుంది. అక్కినేని నాగ చైతన్య, సమంత రుత్ ప్రభుతో తను తీసిన ఏం మాయ చేశావే ఇప్పటికీ వెండి తెరపై అద్భుతమైన ప్రేమ కావ్యంగా గుర్తుండి పోతుంది.
Director Gowtham Vasudev Menon Shocking Comments
తాజాగా తను సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాగున్నప్పుడే సినిమా రంగంలో పలకరింపులు ఉంటాయని, ఆ తర్వాత చూసీ చూడనట్లు వ్యవహరిస్తారని, ఎవరూ ఆదుకునేందుకు రారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ వాసుదేవ మీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా మరో కీలకమైన కామెంట్స్ చేయడం చర్చకు దారితీసేలా చేశాయి.
ప్రముఖ నటుడు ధనుష్ తో తాను సినిమా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు. తనకు ఆ సినిమాతో సంబంధం లేదన్నాడు. ఎనై నోకి పాయుమ్ తోట సినిమా తీసినా తనది కాదంటూ పేర్కొనడం ఒకింత అభిమానులను ఇబ్బంది పెట్టేలా చేసింది.
మొత్తంగా గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ మధ్యన కొంత నిరాశకు లోనైనట్లు కనిపిస్తోంది. దళపతి విజయ్ , త్రిష కృష్ణన్ తో కలిసి చేసిన మూవీలో నటించాడు . అలరించాడు ప్రేక్షకులను. గౌతమ్ ఎందుకు ఇలా మాట్లాడాడనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Also Read : Actor Naresh Struggles : నరేష్ ప్రయాణం 52 ఏళ్ల ప్రస్థానం