Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు షారుఖ్. ఒకప్పుడు ఆడిషన్స్ కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన స్థాయి నుంచి నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన సినిమా తారల్లో ఒకరిగా ఎదిగారు షారుఖ్. అయితే ఇదంతా ఒక్క రోజులో రాలేదు. షారుఖ్(Shah Rukh Khan) ఎన్నో ఏళ్ల కృషి ఫలితమే ఇది. ఎన్ని రికార్డులతో పాటు మరెన్నో అవార్డులు సైతం షారుఖ్ వశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకున్నారు. స్విట్టర్లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో అవార్డును అందుకున్న షారుఖ్ అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఈ అవార్డును అందించారు. ఇలాంటి గౌరవాన్ని పొంది చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్ నటుడిగా షారుఖ్ నిలవడం విశేషం.
Shah Rukh Khan…
ఈ క్రమంలోనే ఈ అవార్డు అందుకున్న సందర్భంలో షారుఖ్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘నా గురించి తెలియక పోతే గూగుల్‌ను అడగండి. అది ఏం చెబుతుందో విని నన్ను ప్రశ్నలు అడగండి’ అని షారుఖ్ సరదాగా మాట్లాడారు. దీంతో షారుఖ్(Shah Rukh Khan) చేసిన వ్యాఖ్యలపై ఏకంగా గూగుల్ స్పందించింది. గూగుల్ ఇండియా ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. షారుఖ్ అంటే.. కింగ్ అనే అర్థం వచ్చేలా.. కిరీటం ఎమోజీని పోస్ట్ చేసింది.
దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజంగానే షారుఖ్ ఇండియన్ సినిమాకు కింగ్ అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. గూగుల్ చేసిన ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ షారుఖ్ సౌత్ ఇండియా ఫిలిమ్ ఇండస్ట్రీపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఇండస్ట్రీలో ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారన్నారు. భారతీయ సినీ రంగంలో గొప్ప సూపర్ స్టార్‌లు చాలా మంది సౌత్ నుంచి వచ్చిన వారేనని షారుఖ్ చెప్పుకొచ్చారు. మణిరత్నంతో కలిసి దిల్‌సే నటించానని, అంతకు మించి తనకేం కావాలంటూ షారుఖ్ చెప్పుకొచ్చారు.
Also Read : Nadigar Sangam : హీరో ధనుష్, విశాల్ కి అండగా నడిగర్ సంఘం