Kannappa : మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. రోజు రోజుకు అప్ డేట్స్ ఇస్తూ మరింత క్యూరియాసిటీని పెంచేలా చేస్తోంది ఈ మూవీ. ఇందులో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు పాన్ ఇండియా హీరోస్. వారిలో డార్లింగ్ ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kannappa – Mohan Babu Look
తాజాగా మూవీ మేకర్స్ కన్నప్ప(Kannappa) గురించి ఆసక్తికర ప్రకటన చేశారు. ఇందులో మరో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ మోహన్ బాబు. ఆయనతో పాటు మోహన్ లాల్ కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. ఇది తన జీవితంలో మరిచి పోలేని మూవీగా ఉండి పోతుందని పదే పదే చెబుతూ వస్తున్నాడు నటుడు మంచు విష్ణు. ఈ మూవీకి సంబంధించి థర్డ్ సింగిల్ అప్ డేట్ వచ్చింది. మహాదేవ శాస్త్రి పరిచయ గీతం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి 19 మోహన్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్బంగా పూర్తి సాంగ్ ను రిలీజ్ చేస్తామన్నారు.
ముఖ్య నటులతో పాటు ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ మంచి పాటలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు కన్నప్ప చిత్రం నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండూ టాప్ లో కొనసాగుతున్నాయి. ఇక మూడో సాంగ్ విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Also Read : Jack Movie Sensational :పెట్టేయనా సిద్దు వైష్ణవి థిల్లానా