Geethanjali Malli Vachindhi: ఎంవివి సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో అంజలి(Anjali) ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. 2014లో విడుదలై విజయవంతమైన ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పేరుతో ఎం.వి.వి.సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుండగా… శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలకశంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజుసంగీతం అందిస్తున్నారు.
Geethanjali Malli Vachindhi Movie Update
ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చిన గీతాంజలి కథగా ఈ సినిమా రూపొందుతున్న ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి టీజర్ లాంచ్ ను చిత్ర యూనిట్ వినూత్నంగా ప్లాన్ చేసింది. ఈ సినిమా టీజర్ లాంచ్ ని ఏకంగా స్మశానంలో ప్లాన్ చేశారు. ఈ ఫిబ్రవరి 24 శనివారం రాత్రి 7 గంటల సమయంలో బేగంపేట్ స్మశానవాటికలో అయితే సినిమా టీజర్ ని లాంచ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. దీనితో ఈ క్రేజీ ప్లాన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.
Also Read : Shanmukh Jaswanth: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ !