Gangs Of Godavari: యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌సేన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari)’. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నేపథ్యంలో యాక్షన్, వినోదం నిండిన కథతో కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ లపై సంయుక్త నిర్మించిన ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 8 ను విడుదల చేయాలనుకున్నప్పటికీ… వివిధ కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 8న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని… అదే సమయంలో నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్’ వంటి సినిమాలు వస్తున్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ పై కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని విశ్వక్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గడంతో…. ఈ సినిమా విడుదలపై విశ్వక్ ఇంతవరకు స్పందించలేదు.
Gangs Of Godavari Movie Updates
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఈ సినిమా ప్రకటించింది. ఈ సినిమాను మే 17న సినిమా విడుదల చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. దీనితో గంగమ్మతోడు సెప్తున్నా మే 17న థియేటర్ శివాలెత్తిపోద్దంతే అని విశ్వక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇప్పటివరకూ విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్, ‘సుట్టంలా సూసి’ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తర్వాత రిలీజ్ కానుంది.
Also Read : Ustad Bhagat Singh : ఫ్యాన్స్ ఊహించని అప్డేట్ రాబోతుందంటున్న మేకర్స్