Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప: ది రైజ్’. రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అప్పట్లో శ్రీ వల్లి, ఊ అంటావా ఊ ఊ అంటావా, నా సామి పాటలు యూ ట్యూబ్ ను షేక్ చేయగా… ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ‘ఊ అంటావా మావ….’ అనే ఐటెం సాంగ్ లో సమంత హాట్ హాట్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Pushpa 2 Updates
దీనితో ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘పుష్ప: 2 ది రూల్(Pushpa 2)’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘సూసేకి’ పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ, హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
‘‘సూసేకి.. స్వీట్ సాంగ్. గ్రాండ్‌గా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించాం. అసలైన డ్యాన్స్ చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎనిమిది రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. కపుల్స్ కూడా తేలిగ్గా డ్యాన్స్ చేయగలిగేలా హుక్ స్టెప్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యా. దానికి తగ్గట్టే కొరియోగ్రఫీ చేశా. అల్లు అర్జున్- రష్మిక తమ డ్యాన్స్‌తో అలరిస్తారు’’ అని పేర్కొన్నారు. అంతకుముందే రిలీజైన టైటిల్ సాంగ్ ‘పుష్ప.. పుష్ప’ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.
‘పుష్ప 1’లోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మావ..’కి కొరియోగ్రఫీ చేసింది గణేశ్ ఆచార్యే. ‘పుష్ప 1’ ఘన విజయం అందుకోవడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘ఊ అంటావా మావ’ను మించేలా ‘పుష్ప 2(Pushpa 2)’లో స్పెషల్ సాంగ్ ఉండేలా టీమ్ సన్నాహాలు చేస్తోంది. అందులో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి ఆడిపాడే అవకాశాలున్నాయని సమాచారం.
Also Read : Hema: బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు !