Game On Movie : గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన గేమ్ ఆన్(Game On) చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవి కస్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.
Game On Movie Updates
ఇటీవల నిర్మాత దిల్ రాజు(Dil Raju), నటుడు శ్రీకాంత్ మరియు హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్ మరియు తరుణ్ ‘గేమ్ ఆన్’ బిగ్ టిక్కెట్ ప్రారంభించి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ జరుగుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమని… యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు గేమ్ థీమ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఏఆర్ మ్యూజిక్, నవాబ్ గ్యాంగ్స్ విడుదల చేసిన పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయని అభిషేక్ అన్నారు.
Also Read : HanuMan OTT : ఓటీటీకి సిద్దమైన హనుమాన్..అది ఎప్పుడు..ఎక్కడ