Game Changer : దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ అంచనాలు మించి పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ఫక్తు పొలిటికల్ ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంగా ఉండడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Game Changer Movie Updates
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా పరంగా చూస్తే చెర్రీతో పాటు ఇతర పాత్రల్లో అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ , జయరామ్, సునీల్, నాజర్ నటించారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. శంకర్ దర్శకత్వంలో తొలిసారి తెలుగులో తీశారు గేమ్ ఛేంజర్ ను. దిల్ రాజు ఎక్కడా తగ్గకుండా ఏకంగా రూ. 350 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దిల్ రాజు తన నిర్మాణ సారథ్యంలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ 50వది కావడం విశేషం. తొలిసారి రామ్ చరణ్ తండ్రీ కొడుకుల పాత్రలలో నటించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనకు , టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చాయి. మొత్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా శంకర్ సినిమా తీశాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Sreeleela Love : సైఫ్ తనయుడితో శ్రీలీల చెట్టా పట్టాల్