Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, రచయిత కార్తిక్ సుబ్బరాజ్ అందించిన పొలిటికల్, యాక్షన్ కథను ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్ లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్, జరగండి జరగడండి సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Game Changer Movie Updates
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరోకీలకమైన అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ‘గేమ్ ఛేంజర్(Game Changer)’లోని రా మచ్చా మచ్చా… పాట కంపోజ్ ని ఇటీవలే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పాట కోసం శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ జానపద కళాకారుల్ని ఒక చోటకు చేర్చి పలు రాష్ట్రాల సంస్కృతులు, సంగీతం ఈ పాటలో కనిపిస్తూ, వినిపించేలా చేసిన ఈ పాటని ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రత్యేకతని దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు తమన్ ఓ వీడియోద్వారా బయట పెట్టారు.
‘‘తెలుగు రాష్ట్రాల్లోని గుస్సాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు లాంటి కళారూపాల్ని ఇందులో భాగం చేయాలనుకున్నాం. ప్రేక్షకులకు మరింత అనుభూతిని పంచడం కోసం ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి పలు నృత్య రీతుల్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశాం. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన రామ్‌చరణ్, ఓ పూర్తిస్థాయి బీజీఎమ్‌కి సింగిల్ షాట్‌లో చేసిన డ్యాన్స్ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Saripodhaa Sanivaaram OTT : ఓటీటీలో సందడి చేస్తున్న నాని, ఎస్ జె సూర్య సినిమా