భారత దేశంలో దిగ్గజ దర్శకుడుగా గుర్తింపు పొందాడు ఎస్ . శంకర్. ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మాణ సారథ్యంలో గేమ్ ఛేంజర్ తీస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు రాబోతున్నాయి. మరోమూవీ నాయకుడు మూవీకి సంబంధించి సీక్వెల్ రానుంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది దీనిని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఏకంగా రూ. 270 కోట్లకు అమ్ముడు పోవడం చరిత్ర సృష్టించింది.
దీనిని జీ5 చేజిక్కించుకుంది. ఈ తాజాగా శంకర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ కలిసి నటిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ గనుక ఆలస్యం అయితే సినిమాను 2025కి వాయిదా వేసే చాన్స్ ఉంది.
నాయకన్ -2 చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో కమల్ హాసన్ కొన్నేళ్ల తర్వాత నటిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా శంకర్ సినిమా అనే సరికల్లా ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూడడం మామూలే.