దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ కొనసాగుతోంది గేమ్ ఛేంజర్ మూవీ. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ కీలక అప్ డేట్స్ ఇచ్చారు. అక్టోబర్ 28న ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ను ఎస్ యు వెంకటశన్ రాశారు. ఇక స్క్రీన్ ప్లే మొత్తం ఎస్. శంకర్ చూసుకుంటున్నారు. కథ మాత్రం ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించడం విశేషం.
ఇందులో కీలక పాత్రలను రామ్ చరణ్ తో పాటు కియారా అద్వాణి నటించారు. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పిస్తోంది. తెలుగు, తమిళం భాషల్లో తీస్తున్నారు దర్శకుడు.
ఈ సినిమా బడ్జెట్ ఖర్చు రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం సినీ వర్గాల అంచనాల మేరకు రూ. 170 కోట్లు గా ఉంటుందని అంచనా. ఈ సినిమాకు ప్రత్యేకించి ఎస్. శంకర్ తీసే సినిమాకు తొలిసారిగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇందులో ఎస్ జె సూర్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27న ప్రకటించారు.