Gadar2 Movie : గదర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైనప్పటి నుండి నేటి దాకా కాసులు కురిపిస్తూ దూసుకుపోతోంది. సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ ప్రకారం ఈ చిత్రం రూ. 500 కోట్లు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు తిరగ రాస్తుందో చెప్పలేమని పేర్కొంటున్నారు.
Gadar2 Movie Blockbuster Collections
అనిల్ శర్మ గదర్ 2 కు దర్శకత్వం వహించాడు. ఇందులో సన్నీ డియోల్ , అమీషా పటేల్ నటించారు. ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి హిందీ చిత్రాన్ని వసూళ్ల పరంగా గదర్ 2(Gadar2 Movie) దాటేయడం విశేషం. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నమోదు చేసింది.
గదర్ -2 విడుదలైన 5వ వారంలో రూ. 515 కోట్లు సాధించడం విశేషం. ఇక చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే 1వ వారంలో రూ. 284.63 కోట్లు, 2వ వారంలో రూ. 134.47 కోట్లు, 3వ వారంలో రూ. 63.35 కోట్లు, 4వ వారంలో రూ. 27.55కోట్లు, 5వ వారాంతంలో రూ. 5.03 కోట్లు సాధించింది. మొత్తంగా గదర్ 2 చిత్రం రూ. 515.03 కోట్లు వసూలు చేయడం విశేషం.
సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో గదర్ -2 మూవీ టీం సంతోషంగా ఉంది. తమకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలనేది నిర్మాత నిర్ణయిస్తారని డైరెక్టర్ చేతిలో ఏమీ ఉండదన్నారు సన్నీ డియోల్.
Also Read : Maharaja First Look : మహరాజా ఫస్ట్ లుక్ కిర్రాక్