Gadar-2 Movie : గ‌ద‌ర్ -2 చిత్రం కాసుల వ‌ర్షం

రూ. 510 కోట్లు వ‌సూలు

Hellotelugu-Gadar-2 Movie

Gadar-2 Movie : బాలీవుడ్ కు మంచి రోజులు వ‌చ్చాయి. బాద్ షా షారుక్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ రూ. 1,000 కోట్లు కొల్ల‌గొట్టింది. మ‌రో చిత్రం అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. తాజాగా స‌న్నీ డియోల్ న‌టించిన గ‌ద‌ర్ -2 రికార్డుల మోత మోగిస్తోంది. బాక్స్ఆఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Gadar-2 Movie Viral

ఈ చిత్రానికి అనిల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ‌క్తి మాన్ త‌ల్వార్ క‌థ స‌మ‌కూర్చారు. గ‌ద‌ర్ -2(Gaddar-2) చిత్రంలో స‌న్నీ డియోల్ తో పాటు అమీషా ప‌టేల్ , ఉత్క‌ర్ష్ శ‌ర్మ‌, గౌర‌వ్ చోప్రా, మ‌నీష్ వాద్వా, సిమ్ర‌త్ కౌర్ న‌టించారు. నానా ప‌టేక‌ర్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇక ఈ చిత్రానికి ప్ర‌ధానంగా హైలెట్ సినిమాటోగ్ర‌ఫీ అని చెప్ప‌క త‌ప్ప‌దు. విశాల్ కుమార్ సంగీతం అందించారు. జీ స్టూడియోస్ పంపిణీ చేసింది ఈ చిత్రాన్ని. రూ. 80 కోట్లు ఖ‌ర్చు చేసి మూవీని రూపొందించారు. కానీ మూవీ మేక‌ర్స్ ఊహించ‌ని రీతిలో కాసులు కొల్ల‌గొడుతోంది. ఇటు ఇండియాలో అటు ఓవ‌ర్సీస్ లో క‌న‌క వ‌ర్షం కురిపిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా రూ. 510.74 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌తంలో వ‌చ్చిన గ‌ద‌ర్ – ఏక్ ప్రేమ్ క‌థ‌కు ఇది సీక్వెల్. ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన హిందీ చిత్రంగా గ‌ద‌ర్ -2 నిలిచింది.

Also Read : RS 500 Crore Club Movies : రూ. 500 కోట్ల క్ల‌బ్ మూవీస్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com