సన్నీ డియోల్, అమీషా పటేల్ కలిసి నటించిన గదర్ 2 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గతంలో వచ్చిన చిత్రానికి గదర్ 2 సీక్వెల్. ఈ ఏడాది షారుక్ ఖాన్ నటించిన జైలర్ చిత్రం తర్వాత భారీ సక్సెస్ సాధించిన మూవీగా సన్నీ డియోల్, అమీషా పటేల్ గదర్ 2 నిలిచింది.
షారుక్ ఖాన్ కెరీర్ లో రెండు మూవీస్ రూ. 1,000 కోట్ల క్లబ్ లోకి చేరాయి. దీంతో షారుక్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇదే సమయంలో గదర్ 2 తట్టుకుని నిలబడింది. పఠాన్ , జవాన్ చిత్రాలు భారీ సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ సంతోషానికి లోనైంది.
గదర్ ఏక్ ప్రేమ్ కథా పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని సీక్వెల్ గా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ సాధించింది. ఏకంగా తక్కువ కాలంలో రూ.500 కోట్ల క్లబ్ ను దాటేసింది గదర్ 2 మూవీ.
ఇందులో సన్నీ డియోల్ తో పాటు అమీషా పటేల్ కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేకించి అమీషా నటనకు జనం ఫిదా అయ్యారు. అంతకు ముందు గదర్ ఏక్ ప్రేమ్ కథ చిత్రం 2001లో వచ్చింది. ఆనాడు ఆ చిత్రం బిగ్ సక్సెస్.