Gadar-2 Director : బాలీవుడ్ లో ఆనందం వ్యక్తం అవుతోంది. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీ స్తబ్దుగా ఉండడంతో ఉన్నట్టుండి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , దీపికా పదుకొనే నటించిన పఠాన్ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో తను నటించిన జవాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిగ్ మార్కెట్ కూడా ఉండడంతో కొంత ఉత్సాహం నెలకొంది.
Gadar-2 Director Got Appreciations
ఇదే సమయంలో డైరెక్టర్ అనిల్ శర్మ(Anil Sharma) దర్శకత్వం వహించిన గదర్ చిత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. దీంతో గదర్ చిత్రానికి సీక్వెల్ గా గదర్ -2 తీశాడు. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన తారగణంగా తెరెక్కించాడు .
అనిల్ శర్మ అద్బుతమైన టేకింగ్ తో తీసిన ఈ సీక్వెల్ సినిమా కూడా ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. కోట్లు కొల్లగొట్టింది. ఏకంగా రూ .500 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళ్లింది. ఇప్పటి వరకు మూడు వారాలు ముగిసే సరికి రూ. 487 కోట్లు వసూలు చేసింది. దీంతో మూవీ మేకర్స్, చిత్ర బృందం ఫుల్ ఖుషీ అవుతోంది.
గదర్ -2 చిత్రం భారీ సక్సెస్ ను మూట గట్టుకోవడంతో దర్శకుడు అనిల్ శర్మ స్పందించాడు. ఈసారి ఎలాగైనా సరే ఆస్కార్ కు తమ సినిమా వెళ్లడం ఖాయమన్నాడు. అవార్డు కూడా వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశాడు.
Also Read : Salaar Movie : ప్రభాస్ సలార్ రిలీజ్ వాయిదా