Jani Master : జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

జాన్సీ మాట్లాడుతూ ‘‘బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది...

Hello Telugu - Jani Master

Jani Master : కొరియెగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన సంగతి తెలిసిందే! బాధిత డాన్సర్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా జానీ మాస్టర్‌(Jani Master) వివాదంపై టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. తమ్మారెడ్డి భరద్వాజ్‌, కె. ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, జాన్సీ తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు.

Jani Master Case..

జాన్సీ మాట్లాడుతూ ‘‘బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. అప్పటి దాకా కాస్త సంయమనం పాటించాలి. ప్రభుత్వం తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ నిమిత్తం సరైన గైడ్‌లైన్స్‌ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్‌ అయింది. అప్పటి నుంచి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నాం. జానీ మాస్టర్‌(Jani Master) వివాదం రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనతో ఉంది. మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరాము. పోలీసుల విచారణ, మా విచారణ పార్లర్‌గా జరుగుతుంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను, జానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశాం. 90 రోజుల లోపే దీనిపై క్లారిటీ వస్తుంది. దయచేసి బాధితురాలి ఫేస్‌ను రివీల్‌ చేయవద్దని మీడియాను కోరుతున్నాం. అవకాశాలు దక్కవనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదు. ప్రతిభ ఉన్నవారికి ఇండస్ట్రీలో తప్పకుండా అవకాశాలు దక్కుతాయి’’ అని అన్నారు.

దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ “జానీ మాస్టర్‌(Jani Master) మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించాము’’ అని అన్నారు. “మీడియా నుంచే జానీ మాస్టర్‌ వివాదం మా దగ్గరకు వచ్చింది. మహిళల భద్రత కోసం 2013 లో ఆసరా అనే కమిటీ పెట్టాం.. 2018లో సరికొత్తగా ప్యానల్‌ ఏర్పాటు చేశా. ఇలాంటివి ఎన్ని ఉన్నా మహిళలకు ధైర్యం, భరోసా ఇవ్వలేకపోతున్నాం. తమకు ఇండస్ట్రీలో సపోర్ట్‌ ఉందనే ధైర్యం కావాలి.. అందుకు తగ్గ కమిటీ ఉండాలి. 90 రోజుల్లో జానీ మాస్టర్‌ కేసు పరిష్కారం అవుతుంది. ఇలాంటి విషయాలను పరిష్కరించడానికి ఛాంబర్‌ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైంట్‌ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. డాన్సర్‌ యూనియన్‌ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Also Read : Kanguva Movie : రిలీజ్ నవంబర్ కి మారిన సూర్య ‘కంగువ’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com